నిరుద్యోగ సమస్యపై చంద్రబాబు మెడలు వంచండి

విశాఖపట్నంః ఏపీలో ఖాళీగా ఉన్న లక్షా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ...  విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ ఎదుట వైఎస్సార్సీపీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు....18 నెలల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పేరుతో తొలగిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ, మండలిలో నిరుద్యోగ సమస్యపై చర్చించి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటించేలా చంద్రబాబు మెడలు వంచాలని ఆయా పార్టీలను కోరారు. 
Back to Top