వైయస్ఆర్ కల సాకారం

వైయస్ఆర్ కడప : పైడిపాలెం రిజర్వాయర్‌ ప్రారంభోత్సవంతో దివంతగ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కల సాకారం అయిందని కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు.  పైడిపాలెంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలోనే ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని, ఆయన హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పైడిపాలెం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలలో కరెంటు బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతోందని, వెంటనే ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల ద్వారా వారి కరెంటు బిల్లులు చెల్లించి, ఆయా కాలనీలకు విద్యుత్‌ సదుపాయం కల్పించాలని కోరారు. 2012–2013వ సంవత్సరంలో దెబ్బతిన్న శనగ పంటకు ఇంతవరకు పరిహారం అందలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సభలో మహానేత పేరు వినపడగానే పెద్ద ఎత్తున హర్షధ్యానాలు వినిపించాయి. వైయస్ఆర్ కృషి వల్లే పైడిపాలెం రిజర్వాయర్ కు నీళ్లు వచ్చాయని, జోహార్ వైయస్ఆర్ అని అవినాష్ అనడంతో ప్రజలు కేరింతలు కొట్టారు. 
 

తాజా ఫోటోలు

Back to Top