వాకాడులో వైఎస్ జగన్..బాధితులకు పరామర్శ

నెల్లూరు : జిల్లా పర్యటనలో ఉన్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..ఇవాళ వాకాడులోని పార్టీ నేత నేదురుమల్లి పద్మనాభరెడ్డి నివాసానికి వెళ్లారు. పద్మనాభరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అక్కడి నుంచి స్థానిక అశోక స్తంభం వద్ద స్థానికులతో వైఎస్ జగన్ కొద్దిసేపు మాట్లాడారు.
 
అనంతరం కోటలో నల్లపురెడ్డి వినోద్ కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులతో గడిపారు. అలాగే వాకాడు, వెంకన్నపాలెంలో వరద బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్య, ఎంపీపీ వినోద్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top