అంబేద్కర్‌ అడుగు జాడల్లో నడిచింది వైయస్‌ఆర్‌ ఒక్కరే

నిజాంపట్నం: డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆలోచనా విధానాలకు అనుగుణంగా పనిచేసిన ఏకైక నాయకుడు దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌  మేరుగ నాగార్జున అన్నారు. మండలంలోని ఆముదాలపల్లి ఎస్సీ కాలనీలో అంబేద్కర్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  రాజ్యాంగ ప్రదాత బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ ఆలోచనా విధానానికి అనుగుణంగా రాజకీయపార్టీలు నడవాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు దళితుల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్లీస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దళితులంటే అంత చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. అంబేద్కర్‌ పేద ప్రజలకు ఉపయోగపడేలా ఎన్నో చట్టాలను రూపొందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.అనంతరం విగ్రహదాత సంతోష్‌ కుమా మేరుగు నాగార్జున అభినందించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, అంబేద్కర్‌ యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top