ప్ర‌జాక్షేత్రంలో వైయ‌స్ఆర్ సీపీదే గెలుపు

తలుపుల: తెలుగుదేశం ప్రభుత్వం డబ్బుతో ప్రజా ప్రతినిదులను కొనొచ్చు కానీ ప్రజాక్షేత్రంలో వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదనడానికి పట్టభద్రుల ఎన్నికల ఫ‌లితాలే నిదర్శనమని వైయ‌స్ఆర్ సీపీ త‌లుపుల మండ‌ల క‌న్వీన‌ర్ శంక‌ర్ అన్నారు. మండల కేంద్రంలోని మహానేత వైయ‌స్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో కుతంత్రపు,దుర్మార్గపు ప్రభుత్వంను రాబోవు రోజుల్లో మట్టికరిపించి, బంగాళాఖాతంలో కలుపుతామని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. అనంతరం బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో పార్టీ మండ‌ల యూత్‌ కన్వీనర్‌ ఉత్తారెడ్డి, సంయుక్తకార్యదర్శి కుర్లిశివారెడ్డి, రైతు సంఘం శివారెడ్డి, ఎస్‌టీ సెల్‌ కుమార్, యరమరెడ్డి, సుబ్బునర్సయ్య, అక్కుల్‌రెడ్డి, మైనార్టీ నాయకులు ఖాదర్‌వలి, సాహెబ్‌పీరా, అమానుల్లా తదితరులు పాల్గొన్నారు.

Back to Top