వైయ‌స్ఆర్‌సీపీదే విజ‌యం

కొత్తపల్లి (నెల్లూరు): న‌ంద్యాల‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌డం ఖాయ‌మ‌ని ఆత్మ‌కూరు  నియోజకవర్గ శాసన సభ్యడు మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు.మంగళవారం మండలంలోని కొత్తపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేక‌రుల‌తో మాట్లాడుతూ అధికారం చేతిలో ఉందని తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎంత డబ్బు కుమ్మరించినా ప్రజలు మాత్రం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నార‌న్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెబుతార‌న్నారు. కల్ల బొల్లి మాటలు ప్రజలు నమ్మి మరో సారీ మోసపోయే పరిస్థితుల్లో లేరన్నారు.

Back to Top