వైయస్సార్సీపీ సేవా కార్యక్రమాలు

రేపల్లెః  కృష్ణా పుష్కరాలకు వచ్చే  భక్తులకు వైయస్సార్సీపీ నాయకులు ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నారు. పట్టణంలోని ఓల్డ్‌టౌన్‌ ఉమామహేశ్వరస్వామి దేవాలయంలో వైయస్సార్సీపీ పట్టణ కన్వీనర్‌ గడ్డం రాధాకష్ణమూర్తి  ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

పెనుమూడి పుష్కరఘాట్‌ వద్ద వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకట రమణారావు ఆధ్వర్యంలో నాయకులు భక్తులకు పులిహోర, మజ్జిగ, తాగునీరును పంపిణీ చేశారు.
Back to Top