నైతిక విజయం వైయస్సార్సీపీదే

భాకరాపేట: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీదే అని చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండల పార్టీ అధ్యక్షులు కె మహేంద్రరెడ్డి, దేపట్ల నాగార్జునరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా భాకరాపేటలో స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ... అధికార పార్టీ డబ్బు బలంతో గెలిచిందన్నారు. ఓటుకు నోట్లు ఇవ్వడంలో అధికార పార్టీ అందవేసిన చేయి అన్నారు. బలం లేని చోట కూడా పోటీ పెట్టి గెలవడంలోనే వారి అధికార దర్పం, డబ్బులు ఎంత పని చేశాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఏది ఏమైనప్పటికి అంతిమంగా నైతిక విజయం వైయస్సార్‌సీపీదే అని అన్నారు.

Back to Top