వైఎస్సార్‌సీపీ నేత పై దాడి

తుని : తూర్పు గోదావ‌రి జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత‌లపై తెలుగుదేశం నాయ‌కుల
దాడులు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. తుని మండ‌లం చేవూరు లో వైఎస్సార్‌సీపీ
నాయ‌కుడు నాగేశ్వ‌ర రావుపై టీడీపీ నేత‌లు క‌త్తుల‌తో దాడి చేశారు. ఆదివారం
అర్థ రాత్రి స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకొంది. ఇంటికి వెళుతున్న నాగేశ్వ‌ర
రావుపై దుండ‌గులు వెనుక నుంచి క‌త్త‌తుల‌తో దాడి చేశారు. తీవ్రంగా
గాయ‌ప‌డిన నాగేశ్వ‌ర రావుకి స్థానికంగా ప్ర‌థ‌మ చికిత్స చేసి, త‌ర్వాత
కాకినాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రి కి త‌రలించారు. ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో
ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Back to Top