వైయస్ఆర్ కాంగ్రెస్‌లో యువతకు పెద్దపీట: జగపతి

మెదక్ టౌన్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా పని చేస్తోన్న వైయస్ఆర్ సీపీ యువతకు పెద్దపీట వేస్తోందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి చెప్పారు. పలువురు యువకులు, విద్యార్థులు పార్టీలో చేరిన సందర్భంగా జగపతి మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో మహానేత  ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కిరణ్ సర్కారు  కుట్ర పన్నుతోందని ఆరోపించారు. వైయస్‌ఆర్ సంక్షేమ పథకాల అమలు ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. రానున్న రోజుల్లో జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వసీం, లడ్డు, సాయి కిశోర్, సలీం, కుమార్, సలావుద్దీన్, ఫయీమ్, యూనిస్, షకీల్, రమేశ్, శ్రీకాంత్, ధారాసింగ్, సాయి, నిఖిల్, ఎజాజ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్, టీడీపీ: ఉప్పునూతల
యాదగిరిగుట్ట : అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు ప్రజావిశ్వాసం కోల్పోయాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి ఉప్పునూత ల పురుషోత్తంరెడ్డి అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట మండలం మోటకొండూర్‌లో వైయస్ఆర్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చామల భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ జెండావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పునూతల మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని నేడు ఆ పార్టీ నేతలే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ కుట్రలను గమనిస్తున్నారన్నారు. రానున్న స్థానిక, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని చెప్పారు. అంతకు ముందు మేడికుంటపల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరిన యువకులకు ఆయన పార్టీ కండువాలు కప్పారు. ఈ కార్యక్ర మాల్లో నాయకులు యమ్మ మల్లేశ్, మోటె సిద్దులు, ఎగ్గిడి వెంకటయ్య, ఉట్కూరి రాజారాంగౌడ్, తాడూరి కృష్ణ, మోటె ఐలయ్య, ఎంబ జనార్దన్, బల్లెం శంకర్, కొన్యాల నర్సింహారెడ్డి, బాల్‌రెడ్డి, సత్యనారాయణ, పన్నాల బుచ్చిరెడ్డి, వంగాల మల్లేశ్, శ్రీకాంత్, కొరటికంటి శ్రీధర్, విజయ్, శ్రీకాంత్, శ్రీను, వినోద్, సురేశ్‌రెడ్డి, వెంకటేశ్ పాల్గొన్నారు.

పేదవాడి గుండెచప్పుడు వైయస్‌ఆర్
నల్గొండ: మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఎక్కడికీ వెళ్లలేదని, పేదల గుండెల్లో జీవించే ఉన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి తెలిపారు. చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ గ్రామంలో ఆదివారం పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ వైయస్ఆర్ నిరంతరం పేదల సంక్షేమం కోసమే పనిచేశారని చెప్పారు. తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు ప్రజల ముందుకు వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించిందని ఆరోపించారు. మహా నేత కుటుంబానికి అపకారం చేసిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. సూర్యాపేటకు పాలేరు జలాలు అందించడంతో పాటు ఎస్సారెస్పీ రెండో దశకు వెంటనే నిధులు, నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కలకొండ పరశురాములు, షేక్ పకీర్ సాహెబ్, కలకొట్ల మల్లయ్య, కలకొండ పిచ్చయ్యతో పాటు 30 మంది యువకులు బీరవోలు సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ చివ్వెంల మండల కన్వీనర్ ధరావత్ శ్రీనివాస్ నాయక్, సూర్యాపేట కన్వీనర్ కృష్ణ రావు, జిల్లా స్టీరింగ్ కమీటీ సభ్యుడు గాజుల రాంబాయమ్మ, తాడోజు జనార్దనాచారి, తండు భాస్కర్, బిక్కుమళ్ల వెంకన్న, దొనకొండ మహేష్, బోడపట్ల ఉపేంధర్, ఎజాష్, జహంగీర్, ప్రవీణ్, మంగ్తానాయక్, కొడి సోమన్న, లోడంగి గంగాధర్ పాల్గొన్నారు.

క్షేత్రస్థాయిలో వైయస్‌ఆర్‌సీపీని బలోపేతం చేద్దాం
కర్నూలు: క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేద్దామని వైయస్ఆర్ కాంగ్రెస్ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్ల హరిచక్రపాణిరెడ్డి మండల నాయకులకు పిలుపునిచ్చారు. నగరంలోని కోట్ల హరిచక్రపాణిరెడ్డి స్వగృహంలో పార్టీ కర్నూలు మండల కమిటీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఒక్కో బూత్‌కి కనీసం పది మంది సభ్యులు ఉండేటట్లు గ్రామ నాయకులు చూడాలన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం కోసం చేపట్టే పథకాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. కోడుమూరు నియోజకవర్గంలో ఈసారి  పార్టీ జెండా ఎగురవేయాలని సూచించారు.  కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రైతు సంఘం జిల్లా నాయకులు కృష్ణారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ నాయకులు నాయకంటి సుదర్శనం, రేణుకమ్మ, తెర్నేకల్లు సురేందర్‌రెడ్డి, కర్నూలు మండల కన్వీనర్ వినయ్‌కుమార్‌రెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ కృష్ణయాదవ్, బీసీ నాయకుడు డి.కె. రాజశేఖర్, గ్రామాల నాయకులు అగ్రిప్, మహేష్, జాన్, తిరుమల్, వెంకటేశ్వర్లు, భాస్కర్, సుధాకర్ పాల్గొన్నారు. 

Back to Top