వైయ‌స్ఆర్ సీపీలోకి ఊపందుకున్న వ‌ల‌స‌లు

కాకినాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. కాకినాడ కార్పొరేషన్‌లో వైయస్‌ఆర్‌ సీపీని గెలిపించేందుకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారు. పట్టణంలోని 48, 49 డివిజన్లకు చెందిన బీజేపీ నాయకులు వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీ సీనియర్‌ నేత కనకదుర్గమ్మ సుమారు 150 మంది అనుచరులతో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. అదే విధంగా రజక సంఘం అధ్యక్షుడు, రజక సంఘ, భానుగుడి ఆటో యూనియన్‌ అధ్యక్షుడు శీల పోతురాజు తన మద్దతుదారులతో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైయస్‌ఆర్‌ సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. 
 
Back to Top