పచ్చ తమ్ముళ్ల పెత్తనంపై వైయస్‌ఆర్‌సీపీ ధర్నా

సంజామల: ఆసరా ఫించన్ల లబ్ధిదారుల ఎంపికలో  తెలుగు తమ్ముళ్ల పెత్తనాన్ని నిరసిస్తూ మంగళవారం వైయస్‌ఆర్‌ సీపీ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఎంపీపీ గౌరుగారి ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ చిన్నబాబు ఆధ్వర్యంలో మండలంలోని పార్టీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.  గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను పక్కనబెట్టి జన్మభూమి కమిటీల పేరుతో ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు సమర్ధించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  గ్రామాల్లో ఫించన్లు పొందేందుకు అన్ని విధాలా అర్హత ఉన్నప్పటికీ వారిని విస్మరించి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు, అనుచరులు అనర్హులైన వారిని ఎంపిక చేయడాన్ని తప్పుబట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిన ఎన్నికైన ప్రజా ప్రతినిధులను పట్టించుకోకుండా ఎంపిక ఎలా చేస్తారని వారు మండిపట్టారు. అర్హులకు న్యాయం చేయాలంటూ తహశీల్దార్‌ ఇంద్రాణికి వినపతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ ప్రజాప్రతినిధులు వైస్‌ ఎంపీపీ లక్ష్మి ఉసేనమ్మ, కానాల, ఆర్‌ లింగందిన్నె, సంజామల, ముక్కమల్ల ఎంపీటీసీలు పెద్ద పెద్దయ్య, మేకల సంతోషమ్మ, అన్నపూర్ణాబాయి, రాజేశ్వరమ్మ, ముక్కమల్ల  సర్పంచ్‌ పోచా వెంకటరామిరెడ్డి, ఎగ్గోని సర్పంచ్‌ గాలిగారి చిన్న మద్దిలô టి, తదితరులు పాల్గొన్నారు.

Back to Top