జ‌లదీక్ష శిబిరాన్ని పరిశీలించిన వైయ‌స్సార్‌సీపీ నేతలు

కర్నూలు:  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టే జలదీక్షకు పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని ప్రజలకు  పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. కర్నూలులో వైఎస్ జగన్ చేపట్టనున్న జలదీక్ష శిబిరాన్ని శనివారం వైయ‌స్సార్ సీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తలశిల రఘురాం పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న అక్రమ ప్రాజెక్ట్ ల వల్ల ఏపీ ఎడారిగా మారే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నీరు లేక 13 జిల్లాల్లోని ప్రజలు వలసలు పోయే పరిస్థితి నెలకొందని విమర్శించారు. కాగా ఈ నెల 16,17,18 తేదీల్లో వైఎస్ జగన్ దీక్ష చేప‌ట్ట‌నున్నారు.

Back to Top