'బెల్ ప్రాజెక్టు కోసం మ‌ధుసూద‌న్‌రెడ్డి పాద‌యాత్ర‌

తిరుపతి: చిత్తూరు జిల్లా మన్నవరంలోనే బెల్ ప్రాజెక్టును నిర్మించాల‌ని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్ సీపీ శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క ఇన్‌చార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డి తిరుపతిలో పాద‌యాత్ర చేప‌ట్టారు.  వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ఈ పాదయాత్రను ప్రారంభించారు. మ‌ధుసూద‌న్‌రెడ్డి మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతో కష్టపడి బెల్ ప్రాజెక్ట్‌ను సాధించారని,  అలాంటి ప్రాజెక్టు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


 వేలాది మంది ఉద్యోగులు అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఈ బెల్ ప్రాజెక్టు మన్నవరంలో కొనసాగించిక‌పోతే ప్ర‌భుత్వం త‌గిన మూల్యం చెల్లించుకుంటుంద‌ని హెచ్చ‌రించారు. ఈ పాదయాత్ర నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనుంది.
Back to Top