మహాత్మా ఫూలేకు విజయమ్మ నివాళి

హైదరాబాద్: 11 ఏప్రిల్  2013:  మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి వైయస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి  వై ఎస్‌ విజయమ్మ పూలమాలవేసి నివాళులర్పించారు. బలహీనవర్గాలు, మహిళల అభ్యున్నతికి పూలే ఎనలేని కృషి చేశారని శ్రీమతి విజయమ్మ నివాళులర్పించారు. పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Back to Top