వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిల‌ర్ల ఆందోళ‌న‌

అనంత‌పురం:  జిల్లాలోని గుంత‌క‌ల్లు మున్సిప‌ల్ కౌన్సిల్ స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. మంగ‌ళ‌వారం మున్సిప‌ల్ కౌన్సిల్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం
ప్రారంభం కాగానే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల‌ర్లు నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. జ‌న్మ‌భూమి క‌మిటీ స‌భ్యుల తీరుపై ప్ర‌తిప‌క్ష స‌భ్యులు నినాదాలు చేస్తుండ‌గా అధికార‌
పార్టీ కౌన్సిల‌ర్లు అడ్డుప‌డ్డారు. దీంతో టీడీపీ స‌భ్యుల తీరును నిర‌సిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిల‌ర్లు నేల‌పై బైఠాయించిన నిర‌స‌న తెలిపారు.
Back to Top