వైయ‌స్ఆర్ కాంగ్రెస్ జ‌డ్పీటీసీపై దాడికి య‌త్నం

యల్లనూరు: మండలంలో నెలకోన్న సమస్యలపై అధికారులను ప్రశ్నిస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ జ‌డ్పీటీసీపై  టీడీపీ ఎంపీటీసీ, వారి అనుచరులు దాడికి యత్నించిన సంఘటన యల్లనూరు మండలంలో చోటు చేసుకుంది. మంగళవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఏంపీపీ మునిప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే మండలానికి వచ్చిన బీసీ, ఏస్సీ, ఏస్టీ, మైనార్టీ లోన్లు, వృధ్ధాప్య, వితంతతు ఫించన్లు తదితర అభివృద్ధి పథ‌కాలు అన్ని టీడీపీ కార్యకర్తలు చెప్పిన వారికే కేటాయిస్తున్నారని, ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రోటోకాల్‌ పాటించకుండా అధికారులు ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారని, ఏంపీడీఓ సాంబశివయ్యపై అనేక అవినీతి అరోపణలు ఎందుకు వస్తున్నాయని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ జ‌డ్పీటీసీ కొత్త‌మిద్దె వెంకటరమణ సభ ముఖంగా ఏంపీడీఓ సాంబశివయ్యను ప్రశ్నించారు. దీంతో ఉద్దేకానికి లోనైన టీడీపీ ఏంపీటీసీ ప్రతాప్‌ రెడ్డి వారి అనుచరులతో సభలోనే అసభ్య పదజాలంతో జెడ్పీటీసీపై దాడికి ప్రయత్నించాడు. వెంటనే అక్కడ ఉన్న పోలీస్‌లు  జోక్యం చేసుకుని గోడవను సర్దుబాటు చేయడం జరిగింది. సమస్యలపై అధికారులను వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నించడమే తప్పు అన్నట్లుగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుల తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

Back to Top