వైయస్ విగ్రహానికి అడ్డుగా గోడ నిర్మాణం తగదు


తెనాలి : పట్టణ అమరవీరుల స్థూపాల వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహానికి అడ్డుగా గోడను నిర్మించ వద్దని , వీటిని వెంటనే విరమించుకోవాలని  కొండవీటి సేవా సమితి, వైయస్సార్‌ సీపీ నేతలు మున్సిపల్‌ కమిషనర్‌ కె.శకుంతలకు విజ్ఞప్తి చేశారు. ఆర్డీవో కార్యాలయంలో ‘మీకోసం’ సమావేశంలో వీరు కమిషనర్ ను కలుసుకున్నారు.  అమరవీరుల స్థూపాల ప్రదేశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే వాదనను తాము తీసుకొచ్చాకనే, అక్కడ బ్యూటిఫికేషన్‌ పనులను మున్సిపాలిటీ చేపట్టిందని గుర్తుచేశారు. అదే సమయంలో వైఎస్‌ విగ్రహం వద్దకు వెళ్లేందుకు కేవలం ఇరుకు ఖాళీ స్థలాన్ని మాత్రమే వదిలారని చెప్పారు. ఇప్పుడు విగ్రహాన్ని మరింత మరుగునపరచాలనే ఉద్దేశంతో ఎత్తయిన ప్రహరీకి పూనుకోవటం, ఆరడుగుల పిల్లర్ల నిర్మాణం సమంజసం కాదన్నారు. తమ మనోభావాలను అర్థంచేసుకోవాలని ఆ ప్రయత్నాన్నివిరమించుకోకుంటే, తాము రోడ్డెక్కి ఆందోళనకు దిగాల్సి వస్తుందన్నారు.  కొండవీటి సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఢాకా సాంబిరెడ్డి, బొంతు చంద్రశేఖరరెడ్డి, సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బాలకోటిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు తాడిబోయిన రామయ్య, బచ్చనబోయిన శ్రీనివాసరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తిరుమలశెట్టి శ్రీనివాసరావు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్‌.రఘురామిరెడ్డి, మైనారిటి విభాగం పట్టణ అధ్యక్షుడు షేక్‌ దుబాయ్‌బాబు, పట్టణ అధికార ప్రతినిధి అక్కిదాసు కిరణ్, అత్తోట చంటి తదితరులు కమిషనర్ ను కలిసిన వారిలో ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top