నైతిక విలువలు కలిగిన పార్టీ: వైయ‌స్ఆర్ సీపీ

కమలాపురం (కడప):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేస్తున్నారని పార్టీ మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు పదే పదే వైయస్‌ జగన్‌ను విమర్శించడం  సరికాదన్నారు.  జగన్‌ నీతి నిజాయితీ కలిగిన నాయకుడు కాబట్టి పదవులకు రాజీనామాలు చేయించి శిల్పా సోదరులను పార్టీలోకి చేర్చుకొని నంద్యాల వైయస్సార్‌ సీపి అభ్యర్థిగా ఎంపిక చేశారని ఆయన గుర్తు చేశారు. నంద్యాల ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే జగన్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు . మూడు టర్మ్‌లు సీఎం గా ఉన్న వ్యక్తి నేను వేసిన రోడ్లపై నడవకండి.. నేనే ఇచ్చే రేషన్‌ తీసుకోవద్దు.. నేను ఇచ్చే పింఛన్‌ తీసుకోవద్దు అని అనడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. రోడ్డు, పింఛన్లు, రేషన్‌ చంద్రబాబు తన ఇంటి నుంచి ఇస్తున్నారా? అది ప్రజా సొమ్ము కాదా అని ఆయన మండి పడ్డారు. నంద్యాలలో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ నైతిక విలువలను మంట గలుపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ సమావేశంలో సింగిల్‌ విండో అధ్యక్షుడు రాజుపాళెం సుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు సుమిత్రా రాజశేఖర్‌రెడ్డి, పీవీ క్రిష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, పట్టణ కన్వీనర్‌ ఎన్‌సీ పుల్లారెడ్డి, ఇతర నాయకులు సుధా కొండారెడ్డి, దేవదానం, జెట్టి నాగేష్, రమణారెడ్డి, రవి శంకర్, ఈశ్వరయ్య, అంబటి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.
Back to Top