కదం తొక్కిన యువత


– నిరుద్యోగ వంచనపై అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు
– జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేత
 
విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరో పోరాటానికి సిద్ధమైంది. చంద్రబాబు చేసిన మోసాలను ఎండగట్టేందుకు ఇవాళ  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అన్ని జిల్లా కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు భారీ ప్రదర్శనలు చేపడుతున్నారు. అనంతరం కలెక్టర్లకు మెమొరాండం  ఇవ్వనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో యువత కదం తొక్కుతున్నారు. యువతను దగా చేసిన ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top