మహిళా సాధికారితకు వైయస్‌ఆర్‌ కృషి మహోన్నతం

విశాఖః మహిళా సాధికారితకు కృషిచేసిన మహోన్నత వ్యక్తి దివంగత మహానేత నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ విశాఖ మహిళా అధ్యక్షురాలు  ఉషా కిరణ్‌ అన్నారు. వైయస్‌ ఆశయాలు కోసం కృషి చేస్తున్న వ్యక్తి జగన్‌ అని అన్నారు. ఆరుగురు మహిళలకు మంత్రుల పదవులు ఇచ్చిన ఘనత వైయస్‌ఆర్‌ది అన్నారు. ఒక మహిళను హోంమంత్రి కూడా చేశారని గుర్తుచేశారు.. వైయస్‌ జగన్‌ అ«ధికారంలోకి వస్తే మహిళలకు మేలు జరుగుతుందన్నారు. వృద్ధాప పింఛన్లు, వితంతు పింఛన్లు, ఆడపిల్లల చదువులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కుల,మతాలకు అతీతంగా అభివృద్ధి చేసారన్నారు.
Back to Top