మాటలే తప్ప చేతలు లేవు

హైదరాబాద్ః చంద్రబాబుపై
వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. మహిళలపై టీడీపీ
సాగిస్తున్న దాడులు, దౌర్జన్యాలపై గిడ్డి ఈశ్వరి, ఉప్పులేటి కల్పనలు
శివాలెత్తారు. అంగన్ వాడీ మహిళలు వివస్త్రలు అయ్యేవిధంగా వాళ్ల బట్టలు
చిరిగిపోయేలా ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఉంచి అర్ధరాత్రి రిలీజ్
చేశారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదన్నారు. మహిళలపై ప్రభుత్వం చేస్తున్న
దురాగతాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. 

దళిత
మహిళల్ని వాడుకొని సభలో జరగాల్సిన అంశాల్ని పక్కదారి పట్టించి ..అసలు
సెక్స్ రాకెట్ కుంభకోణం మీద చర్చ జరగకుండా చంద్రబాబు నిందితులను కాపాడాలని
ప్రయత్నిస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టమని మాటల్లో చెప్పడం కాదు చంద్రబాబు
చేతల్లో చూపాలని వారు డిమాండ్ చేశారు. మహిళల మాన ప్రాణాల్ని దోచుకున్న
వాళ్లందర్ని  కఠినంగా శిక్షించాలన్నారు.  
Back to Top