ఎన్నికలు ఎప్పుడొచ్చిన వైయ‌స్ఆర్‌సీపీదే విజ‌యం

చిత్తూరు(భాకరాపేట) :  రాష్ట్రంలో ఎన్నిక‌లు ఎప్పుడొచ్చిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమ‌ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాలం యుగంధర్‌రెడ్డి అన్నారు. బుధవారం చిన్నగొట్టిగల్లు మండల కేంద్రంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నగొట్టిగల్లు ఎంపీపీ స్వరూప పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వీట్స్‌ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీలు యండపల్లె శ్రీనివాసులురెడ్డి, విఠపు బాలసుబ్రమణ్యం గెలుపున‌కు వైయ‌స్ఆర్‌సీపీ మద్దతు ఇవ్వడం ద్వారా మంచి విద్యా వేత్తలను, రాజనీతి కలిగిన వారిని మండలి సభకు పంపడం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, విద్య, వైద్యం, రైతు విధానలపై పెద్దల సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో భారీ అవినీతికి పాల్పడి ఓట్లు కోనుగొలు చేసి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను గెలిపించుకుందని ఆరోపించారు. ప్రజల మద్దతు ఎలా ఉందో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలు నిరూపించాయన్నారు. డబ్బులు పెట్టి ఓటర్లును కొనుగోలు చేయాలనుకుంటే విద్యావంతులు ఎలా తిరస్కరించరో ఈ ఎన్నికలు అద్దం పడుతాయన్నారు. స్థానిక ఎమ్మెల్సీల్లో కూడా నైతిక విజయం వైయ‌స్ఆర్‌సీపీదే అన్నారు. ధనాక్షేత్రంలో గెలుపు మీది, ప్రజా క్షేత్రంలో గెలుపు మాది అని అభివ‌ర్ణించారు. విజయోత్సవ కార్యక్రమంలో జై జగన్‌ జైజై జగన్, చెవిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి.. అంటూ పెద్ద పెట్టున నినదించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ సేవాదళ్‌ రా్రçష్ట ప్రదాన కార్యదర్శి అన్వర్‌బాషా, మండల కోఆఫ్షన్‌ మెంబరు ఖదీర్‌అహ్మద్, పార్టీ నాయకులు భాస్కర్‌రెడ్డి, కొండారెడ్డి, అక్బర్‌ఖాన్, ఇర్షాద్, భూషణ, దేవప్రసాద్, గిరి, కృష్ణమూర్తి, నరసింహారెడ్డి, ఆదినారాయణరెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, చెంగల్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, నూర్, బావాజీ, బావాజాన్, టీఎస్‌ రఫీ, బాలకృష్ణారెడ్డి, రాజారెడ్డి, రెడ్డెప్పరెడ్డి, కుమార్, మోహన్, సుబ్రమణ్యం, రెడ్డిశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top