ఎన్నికలెప్పుడొచ్చినా వైయస్‌ఆర్‌ సీపీదే విజయం

  • వైయస్‌ జగన్‌ సీఎం అయితే ప్రజారంజక పాలన
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు రూరల్‌: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశానికి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే జనరంజక పాలన అందిస్తారని చెప్పారు. ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఒక్క రూపాయి కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ... నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని పటిష్టంగా చేయడం కోసం ప్రతి పోలింగ్‌ బూత్‌లో బూత్‌ కమిటీలని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతీ కార్యకర్తకి గుర్తింపు కార్డు ఇస్తున్నామని, కార్యకర్తల శ్రేయస్సు కోసం ఇన్సూరెన్స్‌ పథకాన్ని గత రెండేళ్లుగా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కార్యకర్త ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఉద్యమించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో వైయస్‌ జగనన్నని ముఖ్యమంత్రిగా గెలిపించుకునే బాధ్యత మనపై ఉందని కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ అవసరం వచ్చినా సదా అన్ని వేళలా సిద్ధంగా మీ వెంట నేనుంటానని భరోసా కల్పించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి, పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 
Back to Top