అసెంబ్లీలో ప్రతిపక్షం వైఎస్సార్సీపీ వాణి

వాడివేడీగా కొనసాగనున్న సమావేశాలు
ప్రజాసమస్యలపై చర్చకు ప్రతిపక్షం పట్టు
ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై నిలదీత
చంద్రబాబుకు వైఎస్ జగన్ ఫియర్

హైదరాబాద్:
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. 18 నెలల పాలనలో
టీడీపీ సాగించిన అవినీతి, అక్రమాలను నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం
వైఎస్సార్సీపీ సిద్ధమైంది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ
నెరవేర్చకుండా వాటిని తుంగలో తొక్కారు. ప్రజాసమస్యలను పూర్తిగా
గాలికొదిలేశారు.  దోచుకోవడం, దాచుకోవడమే పనిగా టీడీపీ ప్రభుత్వం  పాలన
సాగిస్తోంది. చంద్రబాబు అండ్ కో విచ్చలవిడిగా పంచభూత్నాల్ని దోచేస్తూ
అవినీతి సామ్రాజ్యాన్ని పెంచి పోషిస్తున్నారు.  అనతికాలంలోనే వేల కోట్ల
కుంభకోణాలకు పాల్పడ్డారు.  అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షంపై అక్రమ
కేసులు బనాయిస్తూ కక్షసాధింపు ధోరణికి పాల్పడుతున్నారు. ఈక్రమంలోనే  
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వైఎస్సార్సీపీ అసెంబ్లీలో ఎండగట్టనుంది. 

పాలన
పడకేయడంతో రాష్ట్రమంతా పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. అధికారాన్ని
అడ్డం పెట్టుకొని పచ్చనేతలు రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు.
అడ్డొచ్చిన వారిపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇసుక నుంచి మట్టి
వరకు బొగ్గు నుంచి గనుల వరకు పచ్చబాబుల దందాలు కొనసాగుతున్నాయి.  రుణాల
మాఫీ ఊసేలేదు. ఉద్యోగాల జాడే లేదు. నిరుద్యోగ భృతిని గంగలో కలిపేశారు. ఇలా
వందలాది వాగ్దానాలకు చంద్రబాబు తూట్లు పొడిచారు. ప్రజలు సమస్యలతో
సతమవుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు
వ్యవహరిస్తున్నారు. అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజలు,
ప్రతిపక్షాలపై దాడులు చేస్తూ అరాచక పాలన సాగిస్తున్నారు. 

కాల్
మనీ సెక్స్ రాకెట్ , ఇసుకమాఫియా, బాక్సైట్ మైనింగ్, కల్తీమద్యం, మద్యపాన
నిషేధం, వరదలు, కరవు, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల,
ఉద్యోగులు-నిరుద్యోగుల సమస్యలు, మద్దతు ధర, తడిసిన ధాన్యం కొనుగోలు,
ప్రత్యేకహోదా సహా అనేక అంశాలపై వైఎస్సార్సీపీ అసెంబ్లీలో టీడీపీని ఇరుకున
పెట్టేందుకు సమాయత్తమైంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీని ప్రజాస్వామ్యబద్దంగా
ఎదుర్కోలేక చంద్రబాబు మరోసారి కుట్రలకు తెరలేపుతున్నారు. ప్రజల ముందు
దోషిగా నిలబడాల్సి వస్తుందని భయపడిన చంద్రబాబు ...ప్రజాసమస్యలపై
పట్టుబట్టిన ప్రతిపక్షానికి  మైక్ ఇవ్వకుండా గత అసెంబ్లీ సమావేశాలను
ఐదురోజుల్లో మమ అనిపించారు. మరోసారి ప్రతిపక్షంపై టీడీపీ మంత్రులు,
ఎమ్మెల్యేలను ఊసిగొల్పి  సమావేశాలను తూతూమంత్రంగా ముగించాలన్న ప్రయత్నాల్లో
ఉన్నారు. చర్చను పక్కదారి పట్టించేందుకు వైఎస్సార్సీపీపై ఎదురుదాడి
చేయాలని కొంతమంది టీడీపీ నేతలను చంద్రబాబు ఎంపిక చేయడం శోచనీయం.
ప్రజాసమస్యలపై చర్చ జరిగి పరిష్కారమయ్యేంత వరకు అసెంబ్లీ సమావేశాలు
కొనసాగించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. 
Back to Top