బోయ‌ల‌కు ఎంపీ టికెట్‌


 
 
 కర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రో తీపి క‌బురు చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో బోయలకు కర్నూలు లేదా అనంతపురం జిల్లా నుంచి ఎంపీ టికెట్‌ కేటాయిస్తామని ఆయ‌న ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గోరంట్లలో జరిగిన బీసీ సంఘాల ప్రతినిధులు సమావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ ఈ హామీ ఇచ్చారు. నిన్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీచేసే తొలి అభ్యర్థి పేరు ముందుగానే ఖరారు చేశారు.  పత్తికొండ నియోజకవర్గ అభ్యర్థిగా కంగాటి శ్రీదేవి పేరు ప్రకటించి సంచ‌ల‌నం సృష్టించ‌గా, ఇవాళ బోయ‌ల‌కు ఎంపీ టికెట్టు ఇస్తాన‌ని చెప్ప‌డం గొప్ప విష‌యం. గతంలో కూడా వైయ‌స్ఆర్‌ సీపీ తొలి అభ్యర్థిగా డోన్‌ నియోజకవర్గం నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎవరికి సీటు ఇచ్చే విషయాన్ని ఏ రాజకీయ పార్టీ  ఇప్పటివరకు ప్రకటించ లేదు. తొలిసారి  పత్తికొండ అభ్యర్థిగా శ్రీదేవి పేరును ఖరారు చేశారు. అంతేకాకుండా బోయ‌ల‌కు ఎంపీ టికెట్టు ఇస్తామ‌ని మాట ఇవ్వ‌డంతో జిల్లా ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. బీసీ స‌మ్మేళ‌నంలో వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. చంద్రబాబు లాంటి మోసపూరిత హామీలు నేను ఇవ్వనని, బోయలకు న్యాయం చేస్తా. రానున్న కాలంలో ప్రతి జిల్లాలో బీసీ కమిటీలను ఏర్పాటు చేస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ వెల్ల‌డించారు. కమిటీ సభ్యులు బీసీల అభిప్రాయాలను సేకరిస్తుంద‌ని తెలిపారు. బోయలకు కర్నూలు లేదా అనంతరం జిల్లా నుంచి ఎంపీ టికెట్‌ కేటాయిస్తామ‌ని చెప్ప‌డంతో ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 
 

Back to Top