ప్ర‌జాక్షేత్రంలో విజ‌యం వైయ‌స్సార్సీపీదే

ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో వైఫ‌ల్యం చెందిన‌ప్పుడు ఆ హామీల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేసే హ‌క్కు ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీకి ఉంటుంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్య‌క్షుడు నాగిరెడ్డి అన్నారు. గడపగడపకూ వైయ‌స్సార్ కాంగ్రెస్  కార్య‌క్ర‌మంలో భాగంగా మోపిదేవి మండలంలో వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ...  రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌సాయంపైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డింద‌న్నారు. అటువంటి రైతుల‌కు ఎన్నో హామీల‌ను ఇచ్చి వాటిని నెర‌వేర్చ‌క‌పోవ‌డం దార‌ణమ‌న్నారు. 

2014 ఎన్నిక‌ల‌ప్పుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావాల‌న్న ల‌క్ష్యంతో ప్ర‌జ‌లు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి 44.9శాతం ఓట్లు వేస్తే.... టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీ కుమ్మ‌క్కై అబద్ధపు హామీలిస్తే 46.8శాతం ఓట్ల‌తో టీడీపీ అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు. ప్ర‌జాక్షేత్రంలో విజ‌యం వైయ‌స్సార్‌సీపీదేన‌న్నారు. 


తాజా ఫోటోలు

Back to Top