వైయస్‌ఆర్‌సీపీకి 150 సీట్లు గ్యారంటీ

తూర్పుగోదావరి: వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి 150 సీట్లు గ్యారంటీగా వస్తాయని, ఈ జిల్లాలో 15 సీట్లు సాధిస్తామని మాజీ మంత్రి  విశ్వరూప్‌ తెలిపారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అమలాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ రోజు మన ఎమ్మెల్యే ఆనందరాజు జన్మదిన వేడుకలని, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎమ్మెల్యే ఉపాధి కూలీలతో మీటింగ్‌ పెట్టుకున్నారన్నారు. మా నాయకుడి పిలుపే ఒక ప్రభంజనమన్నారు. రాబోయే రోజుల్లో వైయస్‌ జగన్‌ ఓ చరిత్ర సృష్టిస్తారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 150 సీట్లు వైయస్‌ఆర్‌సీపీ గెలుచుకుంటుందన్నారు. మా కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు పదిహేనురోజులుగా ఎదురుచూస్తున్నారని చెప్పారు.
Back to Top