<img style="border:6px none;width:489px;height:636px;vertical-align:bottom" src="/filemanager/php/../files/A/poster.gif"><br>తూర్పుగోదావరి: రైతులను మోసం చేసిన వారికి, ప్రభుత్వాలకు పుట్టగతులుండవని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమని వైఎస్‌ఆర్‌సీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు అన్నారు. రుణమాఫీ పేరుతో అన్నదాతలను నట్టేట ముంచిన చంద్రబాబుకు కూడా పుట్టగతులుండవని చెప్పారు. మొగల్తూరులో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఎడ్ల బళ్ల ప్రదర్శన నిర్వహించారు. తణుకు పట్టణంలో ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జగన్‌మోహన్‌రెడ్డి చేయనున్న దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ ఈ ప్రదర్శన సాగింది. ఈసందర్భంగా కొత్తపల్లి సుబ్బరాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎప్పుడూ ఇంత దయనీయంగా లేదన్నారు.