'మాట తప్పితే సమరమే'

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొర్రీలొద్దు
ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం హెచ్చరిక
‘విద్యార్థి మహా గర్జన’కు భారీగా తరలి వచ్చిన విద్యార్థులు

అనంతపురం: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలుచేయకపోతే ప్రత్యక్ష పోరాటాలు తప్పవని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ఆ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరశురామ్ అధ్యక్షతన నిర్వహించిన ‘విద్యార్థి మహా గర్జన’ సభకు వందలాది  మంది విద్యార్థులు తరలి వచ్చి నేతల ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. స్థానిక లలిత కళాపరిషత్‌లో ఆలోచనాత్మకంగా సాగిన సభకు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలామ్‌బాబా, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తోపుదుర్తి భాస్కరరెడ్డి,  నవీన్ నిశ్చల్, చవ్వా రాజశేఖరరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సోమశేఖరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు లింగారెడ్డి, నరేంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి మారుతి ప్రకాష్, నరసింహారెడ్డి, ఎస్కేయూ విభాగం అధ్యక్షుడు గెలివి నారాయణరెడ్డి, ఖలీల్, నగర అధ్యక్షుడు జంగాలపల్లి రఫీ తదితరులు ప్రసంగించారు. గతంలో ప్రజలకు అండగా నిలిచిన పతకాలను చంద్రబాబు ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. నిరుద్యోగులకు భృతి వెంటనే ఇవ్వాలన్నారు. ఎన్నికలలో బూటకపు హామీలిచ్చి అన్ని వర్గాల వారిని మోసం చేసిన చంద్రబాబు విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టడం దారుణమని, దీనికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. సమస్యలను దారి మళ్లించే విధంగా వైఎస్సార్ విగ్రహాలను కావాలని కూల్చివేస్తున్నారని, ట్రాఫిక్ సమస్యలంటూ తొలగిస్తున్నారని మండిపట్టారు. ఇవన్నీ చూస్తుంటే కక్ష సాధింపు ధోరణి స్పష్టంగా కనబడుతోందని పలువురు వ్యక్తులు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల సమస్యలపై ఇక తరచూ సదస్సులు నిర్వహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇంటర్‌లో ప్రతిభ కనబరచిన వారికి ‘విద్యార్థి ప్రతిభ కనబరచిన వారికి ‘విద్యార్థి ప్రతిభా పురస్కారాల’ను ఏటా ఐదుగురికి అందజేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ , పార్టీ నేతలు శ్రీదేవి, రంగంపేట గోపాలరెడ్డి, చింతకుంట మధు, యువజన విభాగం నాయకులు ధనుంజయయాదవ్, ఎస్సీ సెల్ నేత ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
Back to Top