కౌన్సిల్ సమావేశాన్ని వాకౌట్ చేసిన వైఎస్సార్‌సీపీ

బాపట్ల: జన్మభూమి సమావేశాలలో అనవసరంగా నిధులు దుర్వినియోగం చేశారని అడిగినందుకు టీడీపీ కౌన్సిలర్లు గొడవకు దిగారు. గుంటూరు జిల్లా బాపట్లలో శనివారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జన్మభూమి సమావేశాలు నిర్వహించేందుకు రూ.2 వేలు సరిపోతాయి కానీ రూ.2.5 లక్షలు అనవసరంగా ఎందుకు ఖర్చు చేశారని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కౌన్సిలర్లు దౌర్జన్యానికి దిగారు. మీ ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను హేళన చేశారు. దీనికి నిరసనగా కౌన్సిల్ సమావేశం నుంచి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు.
Back to Top