అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్‌

హైద‌రాబాద్‌) నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌టం లేదంటే నిరుద్యోగ భృతి క‌ల్పించ‌టంలో ప్ర‌భుత్వం వైఫ‌ల్యం చెందింద‌ని వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఈ విష‌యంలో ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా శాస‌న‌స‌భ నుంచి వాకౌట్ చేసింది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల మీద ప్ర‌త‌పక్ష నేత వైఎస్ జ‌గ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. ఉద్యోగాలు ఇవ్వ‌టం లేదు స‌రిక‌దా, ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అనంత‌రం స‌భ నుంచి వాకౌట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో స‌భ్యులంతా స‌భ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. 
Back to Top