హైదరాబాద్) శాసనసభ నుంచి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. రైతు రుణ మాఫీ అంశం మీద ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఉప్పులేటి కల్పన ప్రశ్న వేశారు. దీనికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఈ సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కలగచేసుకొని మాట్లాడుతుండగా స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు అబద్దాలు చెప్పి, రుణమాఫీ చేయకుండా తప్పించుకొంటూ రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న ప్రభుత్వ తీరుని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ ప్రకటించారు. ఆయన నాయకత్వంలో వైఎస్సార్సీపీ సభ్యులంతా వాకౌట్ చేశారు.