అవినీతి పాల‌న‌ను సాగ‌నంపుదాం

యలమంచిలి:

రాష్ట్రంలో అవినీతి పాల‌న రాజ్య‌మేలుతుంద‌ని, ఇలాంటి ప్ర‌భుత్వాన్ని సాగ‌నంపుదామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ వైజాగ్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. అన్నివర్గాల ప్రజలు కష్టాలు తీరాలంటే  వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రావాలని వైయ‌స్‌ జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమన్నారు.  శుక్రవారం యలమంచిలి నియోజకవర్గకన్వీనర్‌ బొడ్డేడప్రాసాద్‌ ఆధ్వరయలో బూత్‌కమిటీ కన్వీనర్లు,సభ్యుల సమావేశం జరిగింది. స్థానిక గురవప్పకళ్యాణమడంపంలో జరిగిన ఈసమావేశంలో అమర్‌నాథ్ మాట్లాడతూ.. రాష్ట్రంలో గత మూడున్నరసంవత్సరాల టీడీపీ పాలనలో పేదవారు,బడుగు, బలహీనవర్గాలతోపాటు మద్యతరగతి వర్గాల ప్రజల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వారికి మేలుచేయాలన్న సంకల్పంతో వైయ‌స్ జగనన్న నవరత్నాలు అనే పథకాలను రూపొందించడం జరిగిందన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాటను తప్పడమే కాకుండా ప్రజాసంక్షేమాన్ని పక్కన పెట్టి అవినీతిపాలన సాగిస్తున్నాడన్నారు. 200కోట్లు ఖర్చుచేసి, ఓటర్లును భయాందోళనకు గురిచేసి నంద్యాల ఎన్నికల్లో గెలిచారన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఖర్చుచేయాల్సిన 12వందల కోట్లు అభివృద్ధిపనులను ఇక్కడే ప్రారభించి ఎన్నికలో గెలవకపోతే ఈపనులన్నీ నిలిపేస్తామని ప్రజలను టిడిపి భయపెట్టా ఓట్లువేయించుకున్నారని అన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌పార్టీ పుట్టిన పరిస్థితులు ప్రజలకు తెలిసినవేనని,130ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌పార్టీని ఎదురించి,సోనియాగాంధీనే రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేసిన ఘనత మన నాయకుడు వైయ‌స్ జగన్‌మోహనరెడ్డిదేనన్నారు. అటువంటిది 35 సంవత్సరాలు చరిత్ర ఉన్న ఈ తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపేసే రోజులు దగ్గరలోనే ఉందన్న విషయం ప్రతి కార్యకర్తకు తెలుసన్నారు. గతంలో జరిగిన చాలా ఎన్నికల్లో టిడీపీ జిపాజిట్లు గల్లంతైనాయన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో అబద్దాల వాగ్ధానాలను చేసి ప్రజలను మభ్యపెట్టి మోసంచేసి ఈనాడు అధికారం నడిపిస్తున్నాడన్నారు. అనకాపల్లి నర్సాపురం ఆయకట్టుకు సంభందించి ఇక్కడి ఆనకట్టకు ప్రతిపైసా పూర్తిగా వైఎస్‌ఆర్‌ అధికారంలో ఉన్నప్పుడే నిధులు మంజూరుచేశారని తెలుగుదేశంపార్టీ ఒక్కరూ పాయి కూడా ఖర్చుచేకుండా దీనికి ఇప్పుడు రంగులు పూసి తామే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేశామని గొప్పలుచెప్పుకోవడం చాలా సిగ్గుచేటన్నారు.  

Back to Top