వచ్చే ఎన్నికల్లో వైయస్సార్‌ సీపీదే గెలుపు

నరసరావుపేట: నరసరావుపేట నియోజకవర్గం నుంచి ప్రత్యర్థులుగా ఎవరు పోటీచేసినా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే గెలుస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఎస్‌.ఎ.హనీఫ్‌ రెండోసారి నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఎస్‌.ఎ.హనీఫ్‌ ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీకి దిశా నిర్దేశం చేశారు. ఓటర్లు మనవైపే ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. వార్డు కమిటీలను ఏర్పాటు చేసి బూత్‌ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. హనీఫ్‌ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం మాత్రమే ఉందన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పట్టణంలో పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి షేక్‌ ఖాదర్‌బాషా మాట్లాడుతూ పట్టణ అధ్యక్షుడిగా రెండోమారు ముస్లిం మైనార్టీ వర్గీయుడినే నియమించడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్‌.సుజాతాపాల్, కందుల ఎజ్రా, కౌన్సిలర్‌ కారుమంచి మీరావలి, అంబవరపు వెంకటేశ్వరరెడ్డి, కంజుల వెంకటరెడ్డి, మండా లక్ష్మణరావు, రామిశెట్టి కొండా, వంకా శ్రీనివాసరెడ్డి, సయ్యద్‌ సున్నీ, జేకే కరీముల్లా, పొదిలే ఖాజా, అన్నం శివాచౌదరి, షేక్‌ గౌస్, మొహిద్దీన్‌ ఖాజా, అచ్చి శివకోటి, పొదిలే ఖాజా, జి.గాబ్రియేలు, గేరా ధర్మారావు, షేక్‌ షాహిదా పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top