కాకినాడలో వైయస్‌ఆర్‌సీపీదే విజయం

  • టీడీపీ ప్రతి ఇంటికి డబ్బులు పంచింది 
  • నంద్యాల  ట్రిక్స్‌ ఇక్కడ కూడా ప్రయోగించారు
  • వార్డుల వారీగా ప్రలోభాలకు గురి చేశారు
కాకినాడ: నగర కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార తెలుగు దేశం పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా కాకినాడలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే విజయమని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు దీమా వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ పోలింగ్‌ అనంతరం ఆయన టీడీపీ అక్రమాలను ఎండగట్టారు. కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..కాకినాడలో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఇంటింటికి వేల రూపాయలు డబ్బులు పంపిణీ చేశారన్నారు. ఉదయం నుంచి  పోలీసులను దారుణంగా వాడుకున్నారని విమర్శించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలా పనిచేశారని ఆరోపించారు.  వైయస్‌ఆర్‌సీపీ నాయకులను నిర్భందించారన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నా స్థానికేతరులు కాకినాడలోనే మకాం వేశారన్నారు. టీడీపీకి చెందిన రౌడీ షీటర్లు, గుండాలు యథేచ్చగా రోడ్లపై నడిచారన్నారు. పోలింగ్‌ బూతుల్లో డబ్బులు పంపిణీ చేశారని ఆందోళన వ్యక్తం చేశౠరు.  నంద్యాలలో టీడీపీ ఎలాంటి ప్రలోభాలకు తెర లేపారో అవన్నీ కూడా కాకినాడలో ప్రయోగించారన్నారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులు ఈ రోజు కూడా పోలింగ్‌ బూతుల్లో తిరిగారన్నారు. ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. మా పార్టీకి చెందిన జనరల్‌ ఏజెంట్‌ను పోలీసులు కారులో ఎక్కించుకొని ఊరంతా తిరిగి టీడీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించారని మండిపడ్డారు. కాకినాడలో అధికార పార్టీ ఏదైనా కొద్దో గొప్పో ఫలితాలు సాధిస్తే అది ప్రలోభాలతోనే అన్నారు. చంద్రబాబు సామాజికవర్గాల వారిగా రాజకీయాలు చేశారని ఫైర్‌ అయ్యారు. కాకినాడలో 12 ఏళ్ల తరువాత ఎన్నికలు జరిగాయి. మూడున్నరేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నా ఎన్నికలు నిర్వహించలేదని తప్పుపట్టారు. మూడేళ్ల బాబు పాలనలో కాకినాడకు ఏమీ చేయలేదు. స్మార్ట్‌ సిటీ అని చెప్పిన బాబు ఇవాల్టి వరకు రూ.5 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. రెండు కిలోమీటర్లు స్మార్ట్‌ సిటీ అంటున్నారు.మిగతా 37 కిలోమీటర్ల నగరం పరిస్థితి ఏంటని నిలదీశారు. కాకినాడ ప్రజలు విజ్ఞులని, అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకు ఓట్లు వేశారని, టీడీపీకి గుణపాఠం చెప్పారని కన్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
Back to Top