ఏపీ అభివృద్ధి వైయస్‌ జగన్‌తోనే సాధ్యం


గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని వైయస్‌ఆర్‌సీపీ యూఎస్‌ఏ కన్వీనర్‌ రత్నాకర్‌ పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు యూఎస్‌ఏ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. మంగళవారం వారు గుంటూరు జిల్లాలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ మద్దతు తెలిపారు. ప్రజలకు వైయస్‌ జగన్‌ అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్న తీరుపై ప్రశంసించారు. ఈ సందర్భంగా రత్నాకర్‌ మాట్లాడుతూ..రాష్ట్ర విభజన అనంతరం అభివృద్ధి ఆగిపోయిందన్నారు. విభజన చట్టంలోని ప్రత్యేక హోదా వచ్చి ఉంటే అభివృద్ధి జరిగేదన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌ చేస్తున్న పోరాట ఫలితంగా చంద్రబాబు కూడా ఇన్నాళ్లు ప్రత్యేక హోదా వద్దని ఇప్పుడు వైయస్‌ఆర్‌సీపీ రూట్లోకి వచ్చారన్నారు. ప్రత్యేక హోదా కోసం తన మంత్రులను రాజీనామా చేయించిన చంద్రబాబు ఇంకా ఎన్‌డీఏ కూటమిలో కొనసాగడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబుది మొదటి నుంచి రెండు నాల్కల ధోరణి అని మండిపడ్డారు. చంద్రబాబు పాలనను మూడు అక్షరాల్లో చెప్పాలంటే వెన్నుపోట్లు, వంచన, మోసం అని అభివర్ణించారు. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చంద్రబాబు చెబుతారన్నారు.
 
Back to Top