ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్ని లండన్ లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 12న లండన్ లోని మిడిలెసెక్సు ప్రాంతంలోని గ్రేట్ వెస్ట్ రోడ్ బుకారా బాంక్వెటింగ్ హాల్ లో వీటిని నిర్వహిస్తారు. ఆరోజు సాయంత్రం నాలుగున్నర నుంచి సాంస్క్రతిక కార్యక్రమాలు, పిల్లల ఆటల పోటీలు వంటివి ఉంటాయి. దీనికి రాష్ట్రం నుంచి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు, ఆర్ కే రోజా, రామక్రిష్ణా రెడ్డి, కాకినాడ ఎంపీ నియోజక వర్గ ఇంచార్జ్ చలమలశెట్టి సునీల్ హాజరవుతారు. పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు హాజరవుతారని పార్టీ యూకే, బ్రిటన్ కమిటీ నాయకులు తెలియచేశారు.