ముందస్తుకు వెళ్ళి ఏం సాధిస్తారు..!

వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణ అ«ధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి
తెలంగాణలో వైయస్‌ఆర్‌సీపీ పోటీకి సిద్ధం
అధ్యక్షులు జగన్‌ మోహన్‌రెడ్డి నిర్ణయాలనికి కట్టుబడి ఉంటాం..
హైదరాబాద్ః టీఆర్‌ఎస్‌ తొమ్మిది నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్ళి ఏం సాధించాలనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో  దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి  పథకాలనే టీఆర్‌ఎస్‌ ముందుకు తీసుకెళ్తుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల హమీలు నెరవేర్చలేదని, తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు.  వైయస్‌ఆర్‌సీపీ నేతలంతా  ఎన్నికల్లో పోటీ చేయడానికి సంసిద్ధమని, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు జగన్‌ మోహన్‌రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.
Back to Top