అగ్ని ప్రమాదంపై గట్టు శ్రీకాంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్‌:  వరంగల్‌లోని భద్రకాళీ ఫైర్‌ వర్క్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. పది మంది సజీవదహనం కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. వరంగల్‌ అగ్ని ప్రమాదంపై తెలంగాణ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండు చేశారు. 
 
Back to Top