విజయమ్మ సారథ్యంలో ఢిల్లీకి పార్టీ బృందం

హైదరాబాద్ :

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కేంద్రం అనుసరిస్తున్న నిరంకుశ, ఏకపక్ష వైఖరిని జాతీయ స్థాయి నాయకులకు వివరించి, వారిని జోక్యం చేసుకోవాలని కోరేందుకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకులు సోమవారం ఢిల్లీకి వెళుతున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ‌ ఈ బృందానికి సారథ్యం వహిస్తారు. ఈ ప్రతినిధి బృందంలో తాను, ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పలువురు పార్టీ ముఖ్య నాయకులు ఉంటారని రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ ఎం‌.వి. మైసూరారెడ్డి తెలిపారు.

Back to Top