నినదించిన ఆంధ్రప్రదేశ్రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ ఆందోళనలు175 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలంటూ అన్నివైపుల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. అవినీతిపరుడు ముఖ్యమంత్రి పీఠానికి తగడంటూ ఆంధ్రావనిలో నిరసనలు మిన్నుముడుతున్నాయి. అవినీతిపరుడైన చంద్రబాబునాయుడు రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాలన్నింటిలోనూ నిర్వహించిన ధర్నాలు, నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. చంద్రబాబు తక్షణం రాజీనామా చేసి తన నేరాన్ని ఒప్పుకొని లొంగిపోతే మంచిది. లేదా ప్రజలే ఆయన్ను అధికారం నుంచి దించుతారు. శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపటానికి సిద్ధంగా ఉన్నారని ఈరోజు ప్రజల స్పందన చూస్తే ఎవరికైనా అర్థమౌతుంది. ఓటుకు రూ.5 కోట్లు చొప్పున దాదాపు రూ. 100 కోట్లు కుమ్మరించి తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను కొనుగోలు చేయటానికి ఉపయోగించిన వ్యవహారం బట్టబయలైన సంగతి తెల్సిందే. ఈ వ్యవహారంలో అవినీతి బాబు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు ఏపీలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.