నకిలీ స్టాంపుల్లాంటివి చంద్రబాబు హామీలు

హైదరాబాద్ :

చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇస్తున్న హామీలు నకిలీ స్టాంపులు, దొంగనోట్లు లాంటివేనని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ న్యాయ విభాగం సమన్వయకర్త వై. నాగిరెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో నకిలీ స్టాంపులు, దొంగనోట్ల కుంభకోణాలు జరిగాయని గుర్తుచేశారు. ప్రభుత్వంలో ఉన్నపుడు చంద్రబాబు నాయుడు చేయనివన్నీ ఇపుడు చేసేస్తామంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

Back to Top