టీడీపీ నీచ రాజకీయాలు

కాల్ మనీ పై డిఫెన్స్ లో చంద్రబాబు
ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలోనికి రాకుండా కుట్ర
గేట్లకు తాళాలు...పోలీసులతో ఎమ్మెల్యేల వాగ్వాదం

అసెంబ్లీః
కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయిన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాకుండా
చూసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులకు
అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడమే గాకుండా  సభ బయటకు కూడా కుటిల రాజకీయాలకు
పాల్పడుతోంది.

సభ వెలుపల అంబేడ్కర్ విగ్రహానికి
నివాళులర్పించేందుకు విపక్ష వైఎస్సార్సీపీ నేతలకు అనుమతి ఇవ్వకుండా
అడ్డుకునే యత్నం చేసింది. అసెంబ్లీ సెక్రటరీ నుంచి ముందస్తు అనుమతి
తీసుకుని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళుతుండగా వైఎస్ జగన్
మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి
తీసుకున్నామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. గేటుకు తాళాలు వేసి
విగ్రహంవైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అంబేడ్కర్
పై కపట ప్రేమ ఒలకబోస్తున్న టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీ ముందున్న ఆయన
విగ్రహాన్ని కనీసం శుభ్రం చేయించలేదని వైఎస్ జగన్ మీడియాకు చూపించారు. తామే
విగ్రహాన్ని శుభ్రం చేస్తామని ముందుకు కదలగా పోలీసులు అడ్డుకున్నారు. తాము
అంబేడ్కర్ విగ్రహాన్ని శుభ్రం చేస్తే ప్రభుత్వం పరువు పోతుందనే భయంతోనే
ఇదంతా చేస్తుందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు.

ప్రధాన
ప్రతిపక్షం వైఎస్సార్సీపీ గొంతు నొక్కుతూ చంద్రబాబు నీచ రాజకీయాలు
చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సభ్యులను మార్షల్స్ తో బలవంతంగా బయటకు గెంటేసి
టీడీపీ సర్కార్ ఇష్టానుసారంగా సభ నడుపుతున్న తీరు చూసి ప్రజలు
అసహ్యించుకుంటున్నారు.   ప్రజాసమస్యలపై చర్చకు వేదికగా నిలిచిన అసెంబ్లీని
చంద్రబాబు తన సొంత ఇంటిలా మార్చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. 
Back to Top