ప్ర‌త్యేక హోదా బిల్లుకి మ‌ద్ద‌తు: మేక‌పాటి

న్యూఢిల్లీ) పార్ల‌మెంటులో ప్ర‌త్యేక హోదాకోరుతూ ప్ర‌వేశ పెడుతున్న ప్రైవేటు బిల్లుకి పూర్తిగా మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు వైయ‌స్సార్సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి వెల్ల‌డించారు. న్యూఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌తంలో పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా కోసం పోరాడిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఈ విష‌యంలో బీజేపీ ని ఒప్పించ‌టంలో టీడీపీ విఫ‌లం అయింద‌ని పేర్కొన్నారు. ప్ర‌త్యేక హోదా పై టీడీపీ కి చిత్త శుద్ది లేద‌ని అభిప్రాయ ప‌డ్డారు.  ప్ర‌జ‌ల అభీష్టానికి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడ‌దీసింద‌ని పేర్కొన్నారు.
Back to Top