జీఎస్‌టీతో చితికిపోతున్న వస్త్ర వ్యాపారులు

నెల్లూరు: స్వతంత్రం వచ్చిన నాటి నుంచి వస్త్ర వ్యాపారులపై ఏ ప్రభుత్వం పన్ను విధించలేదని, బీజేపీ దేశంలో కొత్తగా జీఎస్‌టీ విధానాన్ని తీసుకొచ్చి వస్త్ర వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తుందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. వస్త్రాలపై జీఎస్‌టీ విధింపునకు నిరసనగా ఆల్‌ ఇండియా టెక్స్‌టైల్‌ ఫెడరేషన్‌ పిలుపు మేరకు నెల్లూరులో వస్త్రదుకాణాలు బంద్‌ నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్, డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్ లు పాల్గొని సంఘీభావం తెలిపారు. జీఎస్‌టీలో వస్త్ర దుకాణాలను కూడా కలపడం బాధాకరమన్నారు. దేశంలో అనేక మంది చిన్న మధ్యతరగతి వారు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వస్త్ర వ్యాపారులను జీఎస్‌టీలోకి తీసుకురావడంతో ఎక్కవ సంఖ్యలో ఉపాధి అవకాశాలు కోల్పోతారని భయబ్రాంతులకు గురవుతున్నారన్నారు. ప్రస్తుతం పెద్ద పెద్ద వ్యాపారులపై ఉండే 5 శాతం పన్ను తొలగించి చిన్న వ్యాపారులపై రుద్ధడం మంచిది కాదన్నారు. ఇప్పటికే వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ జీఎస్‌టీ నుంచి చేనేతరంగాన్ని మినహాయించాలని కేంద్రాన్ని కోరారని గుర్తు చేశారు. మిన హాయింపు కోరుతూ వైయస్‌ జగన్‌తో కేంద్రానికి లేఖ కూడా రియిస్తామని, వ్యాపారులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు వేలూరు మహేష్, దార్ల వెంకటేశ్వర్లు, మున్వర్, తారిఖ్, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top