వెంకట్ రెడ్డి సతీమణికి వైఎస్సార్సీపీ మద్దతు

హైద‌రాబాద్‌: చ‌ట్ట‌స‌భ‌ల స‌భ్యులు మ‌ర‌ణించిన సంద‌ర్భంలో వారి కుటుంబ స‌భ్యులే అభ్య‌ర్థి అయితే, పోటీ పెట్టరాద‌న్న‌ది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వ‌ర‌కు అనుస‌రిస్తున్న విధానం. శ్రీ‌ రాంరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మ‌ర‌ణం నేప‌థ్యంలో ఖ‌మ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక జ‌రుగుతున్న విష‌యం విధిత‌మే. వెంక‌ట్‌రెడ్డి స్థానంలో ఆయ‌న స‌తీమ‌ణి సుచ‌రిత‌మ్మ పోటీ చేస్తున్న నేప‌థ్యంలో ఆమెకు మ‌ద్ద‌తు తెలుపుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం గ‌తంలోనే నిర్ణ‌యించింది. ఈ మేర‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ విభాగం అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వైదొల‌గిన నేప‌థ్యంలో పాలేరు ఉప ఎన్నిక‌కు సంబంధించి వైఎస్సార్‌సీపీ విధానంలో ఎలాంటి మార్పు లేదని, రాంరెడ్డి సుచ‌రిత‌మ్మ‌కు వైఎస్సార్‌సీపీ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని పార్టీ  ఓ ప్రకటన విడుదల చేసింది.  
Back to Top