బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి సంపూర్ణ మద్దతు

  • వైయస్ జగన్ కు అమిత్ షా ఫోన్
  • రామ్ నాథ్ కోవింద్ కు వైయస్సార్సీపీ మద్దతు
హైద‌రాబాద్‌:  రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  సంపూర్ణ మద్ద‌తు ప్ర‌క‌టించారు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు కోసం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు  అమిత్‌షా  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఫోన్ చేశారు. రామ్‌నాథ్‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని అమిత్‌షా వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కోరారు. రామ్‌నాథ్ కోవింద్ ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపారు. ఈ మేర‌కు సోమ‌వారం పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. కాగా, గ‌త నెల‌లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌ధానితో భేటీ అనంత‌రం రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తిస్తామ‌ని పేర్కొన్న విష‌యం విధిత‌మే. అదేవిధంగా ఇటీవ‌ల వైయ‌స్ఆర్‌సీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి బీహార్ గవ‌ర్న‌ర్‌, ప్ర‌స్తుత ఎన్‌డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి రామ్‌నాథ్ కోవింద్ తో భేటీ అయ్యారు.
Back to Top