ఫాతిమా విద్యార్థుల దీక్షకు వైయస్‌ఆర్‌ సీపీ మద్దతు

విజయవాడ: ఫాతిమా కాలేజీ విద్యార్థుల దీక్షకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మద్దతు పలికారు. ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్‌లు దీక్షలో కూర్చున్నారు. కాలేజీ యాజమాన్యం వల్ల నష్టపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రివిజన్‌ పిటీషన్‌తో ప్రయోజనం లేదని, చంద్రబాబు హామీలపై తమకు నమ్మకం లేదని విద్యార్థులు వాపోయారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డికి విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. 
Back to Top