అంగన్‌వాడీల ఆందోళనకు వైయ‌స్ఆర్‌సీపీ మద్దతు

అనంత‌పురం: అంగ‌న్‌వాడీల ఆందోళ‌న‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. అనంత‌పురం న‌గ‌రంలో సోమ‌వారం అంగ‌న్‌వాడీలు త‌ల‌పెట్టిన ధ‌ర్నాకు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వెన్న‌పూస గోపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బీఎల్వో, తదితర డ్యూటీలతో పాటు సూపర్‌వైజర్లు, సీడీపీఓలు చేయాల్సిన ఆన్‌లైన్ పనులు కూడా అంగన్‌వాడీ కార్యకర్తలతో చేయిస్తున్నారన్నారు. ఐదు నెల‌లుగా వేత‌నాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో అంగ‌న్‌వాడీలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎన్నికలలో ఎన్నో వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ వారి సమస్యలపై స్పందించకపోవ‌డం దారుణ‌మ‌న్నారు. అంగ‌న్‌వాడీలు చేస్తున్న పోరాటాల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్ద‌తు ఉంటుంద‌ని తెలిపారు. 

Back to Top